13, ఆగస్టు 2012, సోమవారం

సారీ ... టీచర్ సినిమా పేరును వెంటనే మార్చాలి.


       సారీ  ... టీచర్ సినిమా పేరును  వెంటనే మార్చాలి. 

            "కదిలించడం  కళాకారుని విధి. నిద్ర పోయే వాళ్ళని  తట్టి లేపండం హాయిగా తృప్తిగా ఏమి పట్టించుకోనటువంటి ఈ ప్రపంచపు పెద్దల్ని కంపింప చేయడం కళాకారుని విధి. అతడు ఈ ప్రపంచపు అజ్ఞాతగతాన్ని గుర్తు చేస్తాడు. వర్తమానాన్ని కళ్ళెదుట నిలుపుతాడు. రాబోయే నూతన జన్మకు దారి చూపుతాడు . అతడు మానవుని ఆత్మలోని  సృజనాత్మక చైతన్యం." ఇవి యుద్ద క్షెత్రాలకు రక్తనిధులు తీసుకు పోయిన మొట్ట మొదటి  వై ద్య వేత్త  డాక్టర్ నార్మన్ భేతూన్ మాటలు. 
                సినిమా ఒక గొప్ప కళారూపం. అది ఈనాడు ఆ పని చేయడం లేదు. ఇంకా  సారీ ... టీచర్, అని పేరుతొ పవిత్రమైన ఉపాద్యా య వృత్తిని   అవమానించే  విధంగా సినిమాలు రావడం మన సినిమాలు ఎ స్తితికి వచ్చాయే అర్ధం అవుతుంది. దుర్మార్గం. మన పిల్లలుకు, విద్యార్దులకు, యువకులకు ఏమి సందేశం ఇవ్వ   దలచుకున్నారు.  భవిషత్ తరాన్ని ఏమి చేయదలచుకున్నారు. క్రిమినల్స్ గా పనికి రానివా ల్లుగా తయారు చేయదలచుకున్నారా.  పాటశాలలు, కళాశాలలు చుట్టూ పనికి రాని  సినిమా వాల్ పోస్టర్లు. ఎవరు పట్టించుకోరు.  సెన్సార్ బోర్డు వారు మంచి సినిమాలు వచ్చేటట్లు చేయాలి. అన వసరమైన డాన్సులు, ఫైట్లు, ఐటైమ్ సాంగులు, చెత్త డైలాగులు లేకుండా చూడవలసినదిగా రుంజ కోరుతుంది.   . సారీ ... టీచర్ అని పేరుతొ, పవిత్రమైన ఉపాద్యా య వృత్తిని   అవమానించే  విధంగా ఉన్న సినిమా పేరును వెంటనే మార్చాలని రుంజ విశ్వ కర్మ రచయితల కళాకారుల వేదిక డిమాండ్ చేస్తుంది. 
                   ఉపాధ్యాయ సంఘాలు , రచయితల కళాకారుల సంఘాలు, తల్లి తండ్రులు, సీనియర్ సిటిజన్  సంస్తలు, ప్రజలు, ప్రజాతం తంత్ర వాదులు తీవ్రంగా  స్పందిచాల్సిందిగా    రుంజ విశ్వ కర్మ రచయితల కళాకారుల వేదిక కోరుతుంది. మన పిల్లలను, యువకులను, విద్యార్ధులను ఈ చెత్త సినిమాలనుంచి కాపాడ వల్సిందిగా,  సెన్సార్ బోర్డ్ ను  రుంజ విశ్వ కర్మ రచయితల కళాకారుల వేదిక కోరుతుంది.  

జ్వలిత                                                                                                                  దాసోజు కృష్ణమాచారి 
అధ్యక్షులు                                                                                                                   కార్యదర్శి